పశ్చిమబెంగాల్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

తాజా వార్తలు

Published : 24/03/2020 21:55 IST

పశ్చిమబెంగాల్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో కరోనా క్రమంగా వేగం పుంజుకుంటోంది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో ఇద్దరికి వైరస్‌ సోకింది. కరోనా లక్షణాలతో ఓ పురుషుడు(58), మహిళ(55) ఆసుపత్రిలో చేరారు. వారికి కరోనా పరీక్షలు చేసిన వైద్యులు వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. మహిళ యూకే నుంచి రాగా.. మరో వ్యక్తి ఈజిప్టు నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. తాజాగా నమోదైన ఈ కేసులతో పశ్చిమబెంగాల్‌లో కరోనా బాధితుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యశాఖ అధికారికంగా ప్రకటించింది. కోల్‌కతాలో కరోనా వైరస్‌ బారిన పడిన ఓ వ్యక్తి సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని