మార్ఫింగ్‌ ఫొటోలపై స్పందించిన ఇవాంక

తాజా వార్తలు

Updated : 01/03/2020 21:34 IST

మార్ఫింగ్‌ ఫొటోలపై స్పందించిన ఇవాంక

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ను భారత పర్యటన తాలూకా తీపి జ్ఞాపకాలు ఇంకా పలకరిస్తూనే ఉన్నాయి. ఇటీవల అగ్రదేశాధ్యక్షుడి పర్యటన సందర్భంగా ఇవాంక కూడా భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా ఆమె తాజ్‌మహల్‌ ముందు కూర్చొని దిగిన ఫొటో ఒకటి బాగా వైరల్‌ అయింది. ఆ ఫొటోను చాలా మంది మార్ఫింగ్‌ చేశారు. ఇవాంకతో పాటు బల్లపై ఆమె పక్కనే కూర్చొని ఉన్నట్లు.. ఆమెను సైకిల్‌ మీద కూర్చోబెట్టుకొని వెళుతున్నట్లు ఇలా రకరకాలుగా ఎడిట్‌ చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. అయితే, అభిమానానికి ఎవరూ అతీతం కాదు కదా.. అందుకే బాలీవుడ్‌ హీరో, ఉడ్తా పంజాబ్‌ ఫేమ్‌ దిల్జిత్‌ దొసాంజ్‌ సైతం ఇవాంకపై ఉన్న అభిమానంతో ఆమెతో దిగినట్లుగా ఫొటో మార్ఫింగ్‌ చేసిన ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టు తిరిగి తిరిగి ఇవాంకకు చేరింది. దీనిపై ఆమె సరదాగా స్పందించారు.

‘అద్భుతమైన తాజ్‌మహల్‌ వద్దకు నన్ను తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. నేనెప్పటికీ మరిచిపోలేని అనుభవాన్ని నాకు ఇచ్చారు’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, ఆదిత్య చౌదరి అనే జర్నలిస్టు ‘మీరు ఆలస్యమయ్యారు పాజీ..’ అంటూ మరికొన్ని ఫొటోలు పెట్టి ట్వీట్‌ చేశారు. దానిపై కూడా ఇవాంక స్పందించారు. ‘భారతీయుల ఆత్మీయతను నేను మెచ్చుకుంటున్నాను. అక్కడ నేను చాలా మంది కొత్త స్నేహితులను చేసుకున్నాను’ అని ఆమె రీట్వీట్‌ చేశారు. అయితే, సాధారణంగా సెలబ్రెటీలు తమ ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తే అసహనం వ్యక్తం చేస్తారు. కానీ, ఇవాంక మాత్రం అలా చేయకుండా తన ప్రత్యేకతను చాటుకుందని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని