బుడతడి డ్యాన్స్‌.. మెలనియా నవ్వులు

తాజా వార్తలు

Published : 26/02/2020 01:31 IST

బుడతడి డ్యాన్స్‌.. మెలనియా నవ్వులు

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలనియా ఓ చిన్నారి నృత్యానికి ఫిదా అయ్యారు. భారత పర్యటనలో భాగంగా రెండో రోజు ఆమె దిల్లీలోని సర్వోదయ కోఎడ్యుకేషనల్‌ సీనియర్‌ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హ్యాపీనెస్‌ క్లాస్‌లో ఆమె పాల్గొని చిన్నారులతో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో వేదికపై తమ సీనియర్‌ విద్యార్థినులు గ్రూప్‌ డ్యాన్స్‌ చేస్తుండగా ఓ బాలుడు పైకిలేచి ఉత్సాహంతో అమెరికా జెండా పట్టుకొని డ్యాన్స్‌ చేసి నవ్వులు పూయించాడు. అప్పటి వరకూ వేదికపై ఉన్న విద్యార్థుల ప్రదర్శనను చూస్తున్న మెలనియా సైతం ఒక్కసారిగా వెనక్కి తిరిగి డ్యాన్స్‌ చేస్తున్న ఆ బుడతడిని చూసి చప్పట్లు కొడుతూ మురిసిపోయారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
 

 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని