లాభాల్లో వాటా.. భర్తకు టాటా

తాజా వార్తలు

Updated : 16/02/2020 08:06 IST

లాభాల్లో వాటా.. భర్తకు టాటా

రూ.1.4 కోట్లు మళ్లించుకొని మాయం

హైదరాబాద్‌: జీవితాంతం తోడుగా ఉంటానంటూ ప్రమాణాలు చేసి.. పదహారేళ్ల కిందట పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వామి అనూహ్యంగా మోసం చేసింది.. సంస్థ ఎదుగుదలకు సహకరిస్తానంటూ చెప్పి ఏడాది కిందట భర్త సంస్థలో ప్రవేశించిన ఆమె ఆర్థిక వ్యవహారాల్లో తనకున్న నైపుణ్యాలతో నెలల్లోనే లాభాలొచ్చే నిర్ణయాలు తీసుకుంది. మరో వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వచ్చిన లాభాలతో భర్త సంస్థలో 30శాతం వాటాను సొంతం చేసుకుంది. రోజువారీ బ్యాంక్‌ వ్యవహారాలు, డిజిటల్‌ నగదు బదిలీలు చేస్తానంటూ చెప్పింది. అమ్మా..నాన్నల వద్దకు వెళతానంటూ భర్తకు చెప్పి  కొద్దినెలల కిందట దిల్లీకి వెళ్లింది. భార్య వెళ్లిన కొద్దిరోజులకు లెక్కలు చూసుకున్న భర్త ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. తనకు తెలియకుండా రూ.1.4కోట్ల నగదును మళ్లించిందని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్‌ చేస్తున్నా స్పందించకపోవడం, అత్త, మామలతో మాట్లాడినా ఉపయోగం లేకపోవడంతో అతడు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లండన్‌లో ఎంబీఏ.. బహుళజాతి బ్యాంకుల్లో ఉద్యోగం.. ఆబిడ్స్‌లో ఉంటున్న అహూజా కొన్నేళ్ల నుంచి సంగీత, నృత్య శిక్షణ, డీజే శిక్షణ సంస్థ ఫ్రాంఛైజీని నిర్వహిస్తున్నాడు. స్నేహితులు, బంధువుల ద్వారా పదహారేళ్ల కిందట దిల్లీకి చెందిన చావ్లాతో పరిచయం పెళ్లికి దారి తీసింది. ఇక్కడికి వచ్చాక హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ, ఏఎంబీ ఆమ్రో బ్యాంక్‌లలో ఆర్థిక సలహాదారుగా కొన్నేళ్లు పనిచేసింది. అనంతరం అహూజా సోదరుడు సందీప్‌ నిర్వహిస్తున్న ఫ్యాషన్‌ దుస్తుల వ్యాపారంలో పెట్టుబడి పెట్టి 33శాతం వాటాను పొందింది. ఫ్యాషన్‌ దుస్తుల సంస్థ లాభాల బాట పట్టడంతో చావ్లా భర్తతో మాట్లాడి తాను కూడా సంస్థలో పెట్టుబడి పెడతానని చెప్పింది. 16 నెలల కిందట అహూజా ఫ్రాంచైజీ సంస్థలో భాగస్వామిగా ప్రవేశించింది.

ఐదు నెలల్లోనే రూ.1.40 కోట్లు.. చావ్లా ఆర్థిక వ్యవహారాల నిర్వహణ నచ్చడంతో అహూజా సంస్థ విస్తరణ, అంతర్గత వనరుల సమీకరణపై దృష్టి సారించాడు. దీంతో ఆమెకు పూర్తిస్థాయి స్వేచ్ఛ లభించింది. సంస్థ బ్యాంకు ఖాతాలను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంక్‌కు మార్పించింది.  అప్పటినుంచి అహూజా సంస్థ ఆర్థిక వ్యవహరాలు చావ్లా గుప్పిట్లోకి వెళ్లాయి. 2019 జనవరి నుంచి మే మధ్య కాలంలో బ్యాంకుల నుంచి చావ్లా రూ. 1.40కోట్లు తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకుంది. అదే నెలలో దిల్లీకి వెళ్లింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని