టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తాజా వార్తలు

Published : 16/02/2020 00:43 IST

టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్ష షెడ్యూళ్లు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి ఈ షెడ్యూళ్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్‌కు తెలంగాణలో 51, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షకు అనుతించబోమని స్పష్టంచేశారు. పరీక్ష ఫీజులో ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు రాయితీలు కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400, ఇతరులకు రూ.500ల చొప్పున పరీక్ష ఫీజు ఉంటుందని చెప్పారు. ఈడబ్ల్యూఎస్‌ అమలుకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతిరాలేదన్నారు. ఎంసెట్‌ దరఖాస్తులో మాత్రం ఈడబ్ల్యూఎస్‌ ఆప్షన్‌ ఉటుందని తెలిపారు. 

ఎంసెట్‌ షెడ్యూల్‌ ఇదే..

* ఈ నెల 19న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

* ఈ నెల 21 నుంచి  మార్చి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

* రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 6వరకు..

* రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 13 వరకు.. 

* రూ. 5వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 20 వరకు..

* రూ.10వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 27 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

* మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు దరఖాస్తులో సవరణలకు అవకాశం

* ఏప్రిల్‌ 20 నుంచి మే 1 వరకు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం

* మే 4, 5, 7 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష

*  మే 9, 11 తేదీల్లో ఎంసెట్‌ వ్యవసాయ, వైద్య పరీక్షలు. 

ఈసెట్‌ షెడ్యూల్‌ ఇదే..
* ఈ నెల 24 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 
* రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 8 వరకు..
* రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 18 వరకు ...
* రూ5వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 25 వరకు.. 
* రూ. 10వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 28 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 
* మే 2న పరీక్ష  Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని