మాయావతి ఇంటికి పవర్‌ కట్‌

తాజా వార్తలు

Updated : 13/02/2020 15:00 IST

మాయావతి ఇంటికి పవర్‌ కట్‌

లఖ్‌నవూ (యూపీ): బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతికి విద్యుత్‌ అధికారులు షాకిచ్చారు. సకాలంలో విద్యుత్‌ బిల్లు చెల్లించనందుకు గ్రేటర్‌ నొయిడాలో ఉన్న ఈ మాజీ ముఖ్యమంత్రి నివాసానికి బుధవారం ఉదయం విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. సుమారు రూ.67 వేలు విద్యుత్‌ బిల్లు బకాయి ఉన్నారని విద్యుత్‌ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీంతో మాయావతి కుటుంబ సభ్యులు వెంటనే రూ.50వేలు బిల్లు చెల్లించిన అనంతరం ఆమె ఇంటికి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. ఇందులో రాజకీయ ఉద్దేశాలేమీ లేవని, కరెంటు బిల్లు చెల్లించని వారికి సరఫరా నిలిపివేయటం మామూలేనని లఖ్‌నవూలోని విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని