మతం మారినా.. ప్రేమ దక్కలేదు!

తాజా వార్తలు

Published : 12/02/2020 00:34 IST

మతం మారినా.. ప్రేమ దక్కలేదు!

హైదరాబాద్‌: ప్రేమ కోసం మతం మారినా.. ప్రియురాలి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన బొబ్బిలి భాస్కర్‌ అలియాస్‌ అబ్దుల్‌ హునైన్‌ ప్రేమ కోసం చావడానికైనా సిద్ధం అంటున్నాడు. కేసు దర్యాప్తు నిమిత్తం ఇవాళ మానవ హక్కుల సంఘం ఎదుట హాజరయ్యాడు. అబ్దుల్ హునైన్‌ ప్రియురాలిని ఆమె తల్లిదండ్రులు కమిషన్‌ ముందు హాజరు పరచనున్నారు. దాదాపు ఏడాది నుంచి ఆయన ప్రియురాలి కోసం పోరాటం చేస్తున్నాడు. వికారాబాద్‌కు చెందిన బొబ్బిలి భాస్కర్‌ ప్రియురాలి షరతు ప్రకారం మతం మార్చుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో గత నెలలో హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించాడు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని