ఆ మంత్రి బూట్లను మోసేందుకో వ్యక్తి..!

తాజా వార్తలు

Published : 26/01/2020 23:02 IST

ఆ మంత్రి బూట్లను మోసేందుకో వ్యక్తి..!

భువనేశ్వర్‌: ఒడిశాకు చెందిన ఓ మంత్రి ఆదివారం గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న తీరు వివాదానికి దారి తీసింది. జెండా వందన సమయంలో మంత్రి బూట్లను ఓ వ్యక్తి పట్టుకున్న వీడియో వైరల్‌గా మారడమే ఇందుకు కారణం. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. వాణిజ్య, రవాణా శాఖ మంత్రి పద్మనాభ్‌ బెహరా గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు కియోంజార్‌ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జెండా ఎగురవేసే క్రమంలో ఆయన బూట్లను పక్కన వదలగా.. వాటిని ఓ వ్యక్తి చేత్తో పట్టుకున్నాడు. జెండా వందన కార్యక్రమం అనంతరం మళ్లీ ఆ వ్యక్తి బూట్లను మంత్రి పాదాల వద్ద ఉంచగా.. ఆయన వాటిని వేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో వివాదాస్పదం అయింది. అనంతరం ఈ విషయమై మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. జెండా ఎగురవేసే క్రమంలో షూ వదిలాను. వాటిని ఎవరూ పట్టుకోలేదని.. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టేశారు.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని