పొంగల్‌ వేడుకల్లో తెలంగాణ గవర్నర్‌

తాజా వార్తలు

Published : 14/01/2020 19:15 IST

పొంగల్‌ వేడుకల్లో తెలంగాణ గవర్నర్‌

చెన్నై: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెన్నైలో తన కుటుంబసభ్యులతో కలిసి పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా ఆమె పొంగల్‌ వండారు. ‘తెలంగాణ- తమిళనాడుకు వారధిలా ఉంటాను. తెలంగాణ సోదరసోదరీమణులకు పండుగ శుభాకాంక్షలు. తమిళనాడులోని ప్రాచీన ఆలయాల శిల్ప సౌందర్యాన్ని వీక్షించాలనే ఆతృతను ప్రజలు కనబరుస్తున్నారు. తమిళనాడు ఆలయాలను సందర్శించి దేవుడిని ప్రార్థించి.. ఇక్కడి ప్రాచీన శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదించాలని అందరినీ ఆహ్వానిస్తున్నాను.’ అని ఆమె తెలిపారు. జల బంధం తదితర అంశాలపై తనకు చాలా ఆలోచనలు ఉన్నాయని వాటిని ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. 

చెన్నైలో పొంగల్ జరుపుకొన్న ఉపరాష్ట్రపతి..

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెన్నైలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని