విద్యుత్‌ అధికారులను కట్టేసిన గ్రామస్థులు

తాజా వార్తలు

Updated : 18/07/2020 20:36 IST

విద్యుత్‌ అధికారులను కట్టేసిన గ్రామస్థులు

ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదంటూ విద్యుత్‌ బిల్లులు వసూలు చేసేందుకు వచ్చిన అధికారులను గ్రామస్థులు స్తంభానికి కట్టేశారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. కరెంటు సమస్యలు పరిష్కరించాలంటూ విద్యుత్‌ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని, దీంతో కరెంటు బిల్లుల వసూలుకు వచ్చిన వారిని తాళ్లతో స్తంభానికి కట్టేశారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చేవరకు వారిని వదిలే ప్రసక్తే లేదని గ్రామస్థులు పట్టుబట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని