మధుకాన్‌ సంస్థల్లో రెండో రోజూ ఈడీ సోదాలు
close

తాజా వార్తలు

Updated : 12/06/2021 20:25 IST

మధుకాన్‌ సంస్థల్లో రెండో రోజూ ఈడీ సోదాలు

హైదరాబాద్‌: నిధుల మళ్లింపు వ్యవహారంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు (తెరాస) చెందిన మధుకాన్‌ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహించారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లోని మధుకాన్‌ ఇన్ఫ్రా కార్యాలయంతోపాటు జుబ్లీహిల్స్‌, ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలు చేపట్టింది. ఇవాళ పలు కార్యాలయాలు తనిఖీ చేయడంతో పాటు  బ్యాంకు ఖాతాలు, లాకర్లను ఈడీ బృందాలు పరిశీలించాయి. జాతీయరహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాల కోసం మళ్లించినట్టు మధుకాన్‌ గ్రూప్‌పై ఈడీ అభియోగం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని