పారదర్శకత కోసమే ఈ-సేవలు: సోమేశ్‌

తాజా వార్తలు

Updated : 03/08/2020 19:22 IST

పారదర్శకత కోసమే ఈ-సేవలు: సోమేశ్‌

తెలంగాణ సీఎస్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ కార్యకలాపాలు సులభంగా, పారదర్శకంగా జరగడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ-ఆఫీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 8 శాఖలు, 2 శాఖాధిపతుల కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య, ప్రణాళిక, కార్మిక, బీసీ సంక్షేమం, హోం, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల్లో.. పీసీబీ, వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయాల్లో ఈ-సేవలు ప్రారంభమయ్యాయి. బీఆర్కే భవన్‌లో ఈ సేవలను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సమర్థమైన, కచ్చితమైన సేవలు అందించేలా ఈ-సేవలు ఉంటాయన్నారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే ఈ-సేవలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దీని ద్వారా ఎక్కడి నుంచైనా పనిచేస్తూ సమర్థమైన పాలనను అందించొచ్చని తెలిపారు. సచివాలయంలో 15 శాఖల్లో ఈ-సేవలు అమలు చేస్తున్నట్లు సీఎస్‌ వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని