Viral video: కన్నీటితో నిండిన కళ్లు.. ఇది ఎలా ఉంటుందో తల్లులందరికీ తెలుసు

తాజా వార్తలు

Published : 09/09/2021 20:19 IST

Viral video: కన్నీటితో నిండిన కళ్లు.. ఇది ఎలా ఉంటుందో తల్లులందరికీ తెలుసు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ తల్లి తన కుమారుడి పుట్టిన రోజున ఓ గిఫ్ట్‌ ఇచ్చి అతడ్ని ఆశ్చర్యపరిచిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియో కాస్త కంటతడి పెట్టిస్తూ నెటిజన్ల హృదయాలను మెలిపడుతున్నట్లుగా ఉంది. ఈ వీడియోలో దివ్యాంగుడైన కుమారుడికి అతని తల్లి పుట్టిన రోజు కానుకగా ఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. దాన్ని అందుకున్న తర్వాత అతను సంతోషంలో మునిగితేలినట్లుగా కనిపిస్తాడు. గిఫ్ట్‌ బాక్స్‌ను తెరిచే ముందు ఓసారి ముద్దాడుతాడు. అందులోని ఫోన్‌ను చూడగానే ఆశ్చర్యానికి గురవుతాడు. తన తల్లిని దగ్గరికి పిలిచి కృతజ్ఞతలు తెలుపుతాడు. ఆ సమయంలో తన నవ్వును ఆపులేకపోతాడు. చివరిలో కెమెరాకి స్టిల్‌ ఇచ్చి ఇద్దరు ఫొటో దిగినట్లుగా అనిపిస్తోంది.

దీన్ని ట్విటర్‌ యూజర్‌ హతిందర్‌సింగర్‌ అనే పేరుతో ఉన్న ఖాతాలో పొందుపరిచారు. ‘తల్లి తన ప్రత్యేక బిడ్డకు మొబైల్ బహుమతిగా ఇస్తున్న ఈ అందమైన వీడియోతో రోజుని స్వాగతిద్దాం. చిన్నారి ముఖంలో చిరునవ్వు, రియాక్షన్‌ చూస్తూ..’ అనే క్యాప్షన్‌తో పోస్టును షేర్‌ చేశారు.

‘‘కన్నీటితో నిండిన కళ్లు. ఇది ఎలా ఉంటుందో తల్లులందరికీ తెలుసు. దేవుడు అతడ్ని ఎల్లప్పుడు ఆనందంగా ఉండేలా చూడాలని కోరుకుంటున్నాను’’ అని ఒకరు వ్యాఖ్యానించగా.. ‘‘నా కళ్లలో కన్నీళ్లు.. నా ముఖంలో చిరునవ్వు’’ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్న ఆ వీడియోను మీరూ చూడండి...



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని