Gold Chain: ఇదేం హెయిర్‌స్టైల్‌ రా బాబూ!

తాజా వార్తలు

Published : 15/09/2021 01:47 IST

Gold Chain: ఇదేం హెయిర్‌స్టైల్‌ రా బాబూ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: చూడగానే ఇదేం ఫ్యాషన్‌ రా బాబూ అనుకోకండి! ఇదేమీ ఫ్యాషన్‌ కోసం కాదు. ట్రెండ్‌ అంతకన్నా కాదు. అసలు దీని కథేమిటంటే... ఇతగాడి పేరు డాన్‌ సుర్‌. మెక్సికోలో ఫేమస్‌ ర్యాపర్‌. ఆభరణాలను అమితంగా ఇష్టపడే డాన్‌ ఏకంగా శస్ర్తచికిత్స చేయించుకొని మరీ ఇన్ని గొలుసులను తలకు అమర్చుకున్నాడట.  ఆభరణాలను తలకు అలంకరించుకున్న ర్యాపర్‌గా చరిత్రలోకి ఎక్కాడు ఈ 23ఏళ్ల యువకుడు. దీని కోసమని ఈఏడాది ఏప్రిల్‌లో తలకు శస్ర్తచికిత్స చేయించుకోగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. అసలు ఇతగాడికి ఎందుకిలా చేయాలని అనిపించిందంటే.. అందరిలా జుట్టుకి రంగు వేసుకోవడం లేదా విగ్‌ ధరించడం నచ్చదంట డాన్‌కి. ఏదైనా సరే! ‘థింక్‌ డిఫరెంట్‌’గా ఆలోచించే డాన్‌.. అందరూ హెయిర్‌స్టైల్‌ డిఫరెంట్‌గా కనిపించడానికి రకరకాల హెయిర్‌డై వేస్తుంటారు. నేనుమాత్రం అలా కాదు ఇప్పుడు మాత్రం నన్ను చూసి కాపీకొట్టరని భావిస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చాడు




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని