Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

తాజా వార్తలు

Published : 22/08/2021 04:25 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

చేపట్టే పనిలో పట్టుదల చాలా అవసరం. కష్టం పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్నిఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. ఈశ్వర ధ్యానం శుభప్రదం.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులను ప్రారంభిస్తారు. మహాలక్ష్మీఅష్టోత్తరం చదివితే మంచిది.

గొప్ప శుభసమయం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేహసౌఖ్యం, సౌభాగ్యసిద్ధి ఉన్నాయి. చేపట్టిన పనులలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

ఒక శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పు పొందుతారు.  సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. అన్నదానం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. శివారాధన శుభప్రదం.

చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. మిత్రుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.

సుఖసౌఖ్యాలు ఉన్నాయి. ప్రారంభించిన కార్యక్రమాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాలను చేకూరుస్తుంది.

మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.

ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి ఆంజనేయ ఆరాధన చేయాలి.

కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. శనిధ్యాన శ్లోకం చదువుకోవాలి.

ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. కొన్ని విషయమాలలో మీరు అనుకున్నదాని కన్నా ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. మనోవిచారం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని