Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19-09-2021)

తాజా వార్తలు

Updated : 19/09/2021 04:24 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19-09-2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించిన పనులు శీఘ్ర విజయాన్ని చేకూరుస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.

సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీ దర్శనం ఉత్తమం.  

మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం మంచిది.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తవ్వవు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి. మంచి జరుగుతుంది. ఆంజనేయ దర్శనం శుభప్రదం.

లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మసందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

మంచి ఫలితాలు సాధించడానికి ఇది సరైన సమయం. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

 

పనిలో శ్రమ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. దుర్గా  ధ్యానం శుభప్రదం.

రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోరాదు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శుభఫలితాలు పొందడానికి వేంకటేశ్వర స్వామిని సందర్శించాలి.

మీ మీ రంగాల్లో యశస్సు పెరుగుతుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. శత్రునాశనం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని