Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-10-2021)

తాజా వార్తలు

Updated : 15/10/2021 04:09 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-10-2021)

 డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మంచి ఫలితాలను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం పారాయణ శుభప్రదం.

మాధ్యమ ఫలితాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. మీ మీ రంగాల్లో బలమైన ప్రయత్నంతో ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.

అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువుల వ్యవహారాలలో అంటీముట్టనట్టుగా ఉండాలి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

 భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో  ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభకరం.

స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు.  ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీవిష్ణు నామ పఠనం ఉత్తమం.

ముందుచూపుతో వ్యవహరించాలి.  కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు మంచి ఫలితాలను ఇస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభాలను చేకూరుస్తుంది.
 

శుభకాలం. ఏ పనులు ప్రారంభించినా త్వరగా పూర్తవుతాయి. బంధు,మిత్ర సహకారం ఉంటుంది. వ్యాపార విజయాలు సిద్ధిస్తాయి. ఇష్టదైవారాధన శుభకరం.

మీ రంగంలో పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది. కాలాన్ని మంచి విషయాల కోసం వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీదుర్గాధ్యానం శుభప్రదం.

 

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన మంచి ఫలితాలను చేకూరుస్తుంది.

ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సర్వత్రా శుభ ఫలితాలు ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయంలో అనుకున్నది దక్కుతుంది. అర్థలాభం ఉంది. లక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని