Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/10/2021)

తాజా వార్తలు

Updated : 10/10/2021 22:26 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/10/2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. ప్రయాణాలు కలసి వస్తాయి.  ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం శుభదాయకం

చేపట్టే పనిలో శ్రద్ధ చాలా అవసరం. సంతోషంగా గడుపుతారు. లాభాన్ని చేకూర్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఈశ్వర శ్లోకాలు చదవాలి. 

అనుకున్న పని జరుగుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరిని  ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచిది. 

కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఈశ్వర ధ్యానం మేలు చేస్తుంది.

ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. స్థానచలనం సూచితం. అధికారుల కోపానికి గురికాకుండా ఓర్పుగా ఉండండి. శివ నామాన్ని జపించాలి.

మిశ్రమకాలం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని దరి చేరనీయకండి. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవాలి.  ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది

శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్ట దైవారాధన శుభప్రదం

మీ మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది.

 

ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థిక యోగం శుభప్రదం. సూర్య ఆరాధన శుభదాయకం.
 

మొదలు పెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. భోజన నియమాలను తప్పకుండా పాటించాలి. శ్రీవారి దర్శనం శుభాన్నిస్తుంది.

మంచి కాలం. ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని