Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/09/21)

తాజా వార్తలు

Published : 10/09/2021 04:02 IST

 Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/09/21)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలు ఉంటాయి.

ప్రారంభించిన కార్యక్రమాలను ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.  

కీలక వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ భాద్యతలు అధికం అవుతాయి. ఒక పరీక్షలాగా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాలలో అజాగ్రత్త పనికి రాదు. ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలనిస్తుంది.

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి. సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచి ఫలితాలనిస్తుంది.

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు తొలగడానికి రామరక్షా స్తోత్రం చదివితే మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే ఇంకా బాగుంటుంది.

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.  
 

ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దైవారాధన మానవద్దు.

 

మీ మీ రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. గతం కన్నామంచి సమయం. బంధు ప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఇష్టదైవనామస్మరణ ఉత్తమం.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.  

చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని