Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

తాజా వార్తలు

Updated : 14/08/2021 05:10 IST

 Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మనసు పెట్టి పనిచేస్తే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. కుజ శ్లోకం చదవడం మంచిది. 

మీ మీ రంగాల్లో ఉద్యోగంలో శుభఫలితాలు ఉన్నాయి. బుద్దిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. విష్ణు ఆలయ సందర్శనం శుభాన్ని ఇస్తుంది. 

మీ మీ రంగాల్లో తోటివారిని కలుపుకొనిపోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత కోసం దైవచింతన అవసరం అవుతుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన చేస్తే మంచిది. 
 

చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. శ్రీ రామనామాన్ని జపించడం శుభప్రదం.

మీ మీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. పెద్దల యందు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం. 

మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం. 

సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

చేతిదాకా వచ్చిన అవకాశాన్ని చేజారకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో స్థానచలన సూచితం. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. అయినవారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది. 

పనులకు అడ్డంకులు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీవిష్ణు నామాన్ని పఠించడం మంచిది.

గ్రహబలం అనుకూలంగా ఉంది. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. తలపెట్టిన కార్యాలను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని ఇస్తుంది. 

చేపట్టిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి ఆంజనేయ ఆరాధన చేయాలి. 

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. వినాయకుని ఆరాధన మేలు చేస్తుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని