Oil Purify Test: చిన్న ప్రయోగంతో కల్తీ నూనెని కనిపెట్టొచ్చు

తాజా వార్తలు

Published : 17/09/2021 09:28 IST

Oil Purify Test: చిన్న ప్రయోగంతో కల్తీ నూనెని కనిపెట్టొచ్చు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన వంటకాల్లో ఎక్కువగా వినియోగించే పదార్థాల్లో నూనె ఒకటి. గత కొద్ది సంవత్సరాలుగా మార్కెట్లో వంటనూనెల ధరలు మండిపోతున్నాయి. దీన్ని అసరాగా తీసుకొని మోసగాళ్లు నూనె కల్తీ చేసి విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాల్లో కల్తీ అనేది ప్రధాన సమస్యగా మారింది. ఆహార కల్తీ వల్ల మనకు తెలియకుండానే పలు రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా వంటనూనెలో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తారు. ఇది ప్రధానంగా ఫాస్పరస్‌ను కలిగిన పెస్టిసైడ్‌. ఇది వాడడం వల్ల నాడీవ్యవస్థ ప్రేరేపితమై పక్షవాతం తదితర రోగాలకు దారితీస్తుంది. అయితే  మనం వాడే వంటనూనెలో ఏది స్వచ్ఛమైనది, ఏది కల్తీదో అనేది ఓ చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చంటూ ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ (ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా) ఓ వీడియోని విడుదల చేసింది.

మీరు చేయాల్సిందల్లా ఈ చిన్ని ప్రయోగమే..

మీరు వాడే నూనెలో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ ఉంది అంటే అది కల్తీని అర్థం. నూనెలో అది ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా రెండు మి.లీటర్ల నూనెను రెండు చిన్న పాత్రల్లోకి తీసుకుని అందులో పసుపు రంగులో ఉన్న వెన్నను రెండింటిలో వేయాలి. కాసేపటి తరువాత చూస్తే పాత్రలోని నూనె రంగుమారకుండా ఉంటే అది స్వచ్ఛమైనది. అందులో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ లేదని అర్థం. అదే నూనె రంగు మారి ఎరుపెక్కితే అది కల్తీ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.   



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని