వింతవ్యాధి మూలాల నిర్ధరణకు కమిటీ  

తాజా వార్తలు

Updated : 11/12/2020 12:53 IST

వింతవ్యాధి మూలాల నిర్ధరణకు కమిటీ  

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 609 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యాధికి గల కారణాలు తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని నమూనాలను అధికారులు సేకరించి జాతీయ పరిశోధన సంస్థలకు పంపారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా వ్యాధి మూలాల నిర్ధరణకు మల్టీడిసిప్లీనరీ కమిటీని ఏర్పాటు చేసింది. వ్యాధి నివారణ చర్యలపై అధ్యయనం, సిఫార్సుల కోసం ఈ కమిటీ పనిచేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన 21 మంది అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఇది. ఇందులో ఎయిమ్స్‌, ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్‌ఐఎన్‌, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉంటారు. వీరు ఏలూరులో తలెత్తిన పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. 

ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడ్డ 609 మందిలో 543 మంది ఆసుపత్రుల్లో కోలుకొని డిశ్చార్జి అయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిలో 33 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. 

ఇవీ చదవండి..

వ్యాధి తీవ్రత తగ్గుతోంది: డీసీహెచ్‌ఎస్‌ మోహన్

ఆర్గానో క్లోరిన్‌ వల్లే!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని