ఆకస్మిక తనిఖీలు చేస్తాను: కేసీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 12/06/2021 13:43 IST

ఆకస్మిక తనిఖీలు చేస్తాను: కేసీఆర్‌

పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 19 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేసి పంచాయతీ రాజ్‌, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలిస్తానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో పట్టణ ప్రగతి అమలుపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముందస్తు ప్రణాళిక సంస్కృతిని అన్ని శాఖల యంత్రాంగం అభివృద్ధి చేయాలని.. ఇందులో భాగంగా సీజనల్‌ వ్యాధుల కట్టడికి అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందన్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 13న జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని