కాశీ విశ్వేశ్వరుడి సేవలో కేసీఆర్‌ కుటుంబం

తాజా వార్తలు

Published : 30/01/2021 01:12 IST

కాశీ విశ్వేశ్వరుడి సేవలో కేసీఆర్‌ కుటుంబం

వారణాసి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి కల్వకుంట్ల శోభ, ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు వారణాసిలో రెండో రోజు పర్యటిస్తున్నారు. గురువారం వారణాసి చేరుకున్న వీరంతా పలు దేవాలయాలను సందర్శించారు. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అన్నపూర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దుందిరాజ్‌ ఆలయంలో గణేశుడికి ప్రత్యేక పూజల అనంతరం వారాహి దేవాలయాన్ని దర్శించుకున్నారు. 

ఇవీ చదవండి..
ప్రపంచానికే గొప్ప ఆస్తి భారత్‌ : ఐరాస

దిల్లీ-యూపీ సరిహద్దుల్లో ఉద్రిక్తత
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని