AP News: గ్రామీణ ముఖచిత్రం మారుతుంది: జగన్‌

తాజా వార్తలు

Updated : 04/06/2021 14:52 IST

AP News: గ్రామీణ ముఖచిత్రం మారుతుంది: జగన్‌

అమరావతి: రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ‘అమూల్’ ద్వారా పాల సేకరణనును మరింత విస్తరించి పాడి రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఈ ఏడాది 2, 600 గ్రామాల్లో.. దశలవారీగా 9,899 గ్రామాల్లో పూర్తిగా అమూల్‌ను విస్తరిస్తామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా అమూల్‌ పాలసేకరణను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ అమూల్ రాకతో వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం మారబోతోందన్నారు. అమూల్‌కు పాలు పోయడం లాభదాయకమని.. పాడి రైతులకు  లీటర్‌కు రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా ఆదాయం వస్తుందన్నారు.  పాడి రైతులకు మంచి ఆదాయం వచ్చేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పాల నాణ్యతను తెలుసుకునేందుకు రాబోయే 2 సంవత్సరాల్లో రూ.4వేల కోట్లతో యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని