వైన్‌ గ్లాసులతో రైలు పలికించిన సంగీతం

తాజా వార్తలు

Published : 08/04/2021 18:19 IST

వైన్‌ గ్లాసులతో రైలు పలికించిన సంగీతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాప్తి వేళ లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో జర్మనీకి చెందిన ఓ మ్యూజియం వినూత్నంగా ఆలోచించి గిన్నీస్‌ రికార్డు నెలకొల్పింది. దాదాపు మూడు వేల వైన్‌ గ్లాసులను క్రమబద్ధంగా ఏర్పాటు చేసి వాటి ద్వారా శ్రావ్యమైన సంగీతం వినిపించింది. ప్రపంచ రికార్డును సొంత చేసుకుంది. వైన్‌ నింపిన గాజు గ్లాసుల మధ్య మోడల్‌ రైలు వెళ్లేలా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. దాని ద్వారా సంగీతం వచ్చేలా చేశారు. జర్మనీకి చెందిన వండర్‌ల్యాండ్‌ మ్యూజియం ఈ వినూత్న కార్యక్రమానికి వేదికైంది. లాక్‌డౌన్‌ కారణంగా మ్యూజియం తెరువకపోవడంతో ఈ కార్యక్రమానికి పూనుకున్నామని నిర్వాహకులు తెలిపారు. సుదీర్ఘమైన శ్రావ్య సంగీతం కోసం కొన్ని వారాలపాటు శ్రమించామని వెల్లడించారు. 
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని