ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాలపై దర్యాప్తు

తాజా వార్తలు

Updated : 11/07/2021 19:26 IST

ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాలపై దర్యాప్తు

అమరావతి:  ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌లో గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ ఫైబర్‌నెట్‌ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్‌, కేబుల్‌ కనెక్షన్లు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. సెట్‌ టాప్‌ బాక్సులు సహా సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం టెండర్లు పిలిచింది. వీటిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. గుత్తేదారుకు అనుకూలంగా టెండర్లను ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే విమర్శలు వచ్చాయి. అవకతవకలపై ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ, ఛైర్మన్‌లు సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి ఈఏడాది ఫిబ్రవరిలో లేఖల ద్వారా కోరారు. ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన మీదట కేసు దర్యాప్తును ఏపీ నేరపరిశోధన విభాగానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరణాత్మక నివేదిక సమర్పించాలని సీఐడీ అదనపు డీజీని ప్రభుత్వం ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని