జీతాలు నిలిపేస్తూ చిత్తూరు కలెక్టర్‌ ఆదేశాలు
close

తాజా వార్తలు

Published : 19/05/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీతాలు నిలిపేస్తూ చిత్తూరు కలెక్టర్‌ ఆదేశాలు

చిత్తూరు: చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 మండలాల ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెదమండ్యం, తవణంపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె మండలాల్లోని  రెవెన్యూ, పంచాయతీరాజ్, హెల్త్, సచివాలయం, మున్సిపల్ శాఖల ఉద్యోగుల నెల జీతాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆరో విడత ఫీవర్ సర్వేలో ఆయా మండలాల్లో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపైనా ఇదే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. జీతాలు నిలిపివేయాలని జిల్లా ట్రెజరీని ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని