14న యాదాద్రికి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ
close

తాజా వార్తలు

Published : 12/06/2021 16:00 IST

14న యాదాద్రికి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ నెల 14న యాదాద్రిలో పర్యటించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ కూడా సీజేఐతో పాటు యాదాద్రికి వెళ్లనున్నారు. సీజేఐ, గవర్నర్, సీఎం కలిసి యాదాద్రిలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. నిన్న హైదరాబాద్‌ చేరుకున్న సీజేఐకి శంషాబాద్‌ విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రాజ్‌భవన్‌లోని అతిథి గృహంలో బస చేసిన జస్టిస్‌ రమణ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉంటారు. ఇక్కడే వివిధ కార్యక్రమాలు, సదస్సుల్లో ఆయన పాల్గొంటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని