సమగ్ర ప్రణాళికతో వ్యర్థాల నిర్వహణ: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 25/06/2021 15:53 IST

సమగ్ర ప్రణాళికతో వ్యర్థాల నిర్వహణ: కేటీఆర్‌

హైదరాబాద్‌: నగరంలో మరో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ అందుబాటులోకి వచ్చింది. వైట్‌ ప్రాసెసింగ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో నాగోల్‌ ఫతుల్లాగూడలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దీని ద్వారా నిత్యం 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీసైకిల్‌ చేసేందుకు అవకాశం ఉంది. ప్లాంట్‌ ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. సమగ్ర ప్రణాళికతో వ్యర్థాల నిర్వహణ చేపడుతున్నట్లు చెప్పారు. భవన నిర్మాణ వ్యర్థాలతో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని.. ఇప్పటికే జీడిమెట్లలో 500 టన్నుల సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నాగోల్‌ ఫతుల్లాగూడలో ఏర్పాటు చేసింది రెండో ప్లాంట్‌ అన్నారు. దిల్లీ, అహ్మదాబాద్‌ తర్వాత హైదరాబాద్‌లోనే సీఅండ్‌డీ ప్లాంట్‌ ఉన్నట్లు కేటీఆర్ వివరించారు. 

నగరంలో రోజుకు వెయ్యి టన్నుల సీఅండ్‌డీ వ్యర్థాల నిర్వహణ జరుగుతున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. వరంగల్‌, ఇతర పట్టణాల్లో క్లస్టర్ల తరహాలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెత్త నుంచి 20 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్లాంట్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరో 28 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. పొడి చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి, తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ వివరించారు. వ్యర్థాల తరలింపునకు 1800-120-1159 టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. నామమాత్రపు రుసుం తీసుకుని ఇంటికే వచ్చి వ్యర్థాలు తీసుకెళ్తారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని