Ruia ఘటన ఎవరి నిర్లక్ష్యమో తేల్చండి: హైకోర్టు

తాజా వార్తలు

Updated : 28/06/2021 14:01 IST

Ruia ఘటన ఎవరి నిర్లక్ష్యమో తేల్చండి: హైకోర్టు

అమరావతి: తిరుపతి రుయా ఘటనపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది బాలాజీ.. ప్రభుత్వం, ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. దీనిపై ఇప్పటి వరకూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని తెలిపారు. ఎంత మంది చనిపోయారో స్పష్టత లేదని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటనలో అసమానతలు పాటించారన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతులకు రూ.కోటి పరిహారం ఇచ్చారని.. రుయా ఘటనలో మృతులకు రూ.10 లక్షలు ప్రకటించారన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్‌ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. రుయా ఆస్పత్రి ఘటన ఎవరి నిర్లక్ష్యమో తేల్చాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం, పోలీసులు, ఆస్పత్రి అధికారులను సూచించింది. అనంతరం పిటిషన్‌కు సంబంధించి విచారణను ఉన్నత న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని