కొవిడ్‌తో అనాథలైన పిల్లలకు ₹10లక్షల సాయం!
close

తాజా వార్తలు

Published : 18/05/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌తో అనాథలైన పిల్లలకు ₹10లక్షల సాయం!

ఏపీ సీఎం జగన్‌ నిర్ణయం

అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్ ఏపీని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ దాదాపు 20వేల కేసులు, వందకు పైగా మరణాలు నమోదు కావడం కలవర పెడుతోంది. కరోనా విలయంతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్న చిన్నారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో మృతిచెందిన వారి పిల్లలను ఆదుకొనేందుకు రూ.10లక్షల ఆర్థికసాయం చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మొత్తాన్ని చిన్నారుల పేరుతో ఎఫ్‌డీ చేయనున్నారు. ఎఫ్‌డీపై వచ్చే వడ్డీతో అనాథ పిల్లల అవసరాలు తీర్చాలని సీఎం సూచించారు. కొవిడ్‌ మృతుల పిల్లలకు సాయంపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఆర్థిక సాయంపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని