దేశంలో ఎన్నడూ లేనంత స్థాయికి విద్యుత్‌ డిమాండ్‌!

తాజా వార్తలు

Updated : 08/07/2021 01:05 IST

దేశంలో ఎన్నడూ లేనంత స్థాయికి విద్యుత్‌ డిమాండ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతదేశంలో విద్యుత్‌ డిమాండ్‌ ఎన్నడూ లేనంత పైస్థాయిని అందుకుంది. ‘‘ మంగళవారంరాత్రి 11.43 గంటలవద్ద 1,97,060 మెగావాట్ల డిమాండ్‌ను చేరుకుంది’’ అని విద్యుత్‌ మంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది.

ఇంతకుముందు జులై 1న భారీ స్థాయిలో 1,91,240 మెగావాట్ల విద్యుత్‌ వినియోగమైంది.  పెరిగిపోతున్న విద్యుత్‌ డిమాండ్‌, దేశంలో మహమ్మారి బారిన పడ్డ పారిశ్రామిక, వాణిజ్య రంగాలు తిరిగి పుంజుకున్నాయనేందుకు, ఆర్థిక కార్యకలాపాలు గాడినపడ్డాయనేందుకు సంకేతమని వివరించింది. కాగా దేశపు మొత్తం విద్యుత్‌ అవసరాల్లో పారిశ్రామిక రంగం నుంచి 41 శాతం, వ్యవసాయ రంగం నుంచి 18 శాతం డిమాండ్‌ ఉంటుంది. ఆ తర్వాత వాణిజ్యపరంగా విద్యుత్‌ వినియోగం 8.24 శాతం ఉంటోంది.  దేశంలోని థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు ఆర్థికంగా తగినంత సహాయసహకారాలు లభించక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నవేళ, వాటిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో తాజాగా పెరిగిపోయిన విద్యుత్‌ డిమాండ్‌ ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇదిలావుంటే కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు  విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పడిపోయింది.  ఆ తర్వాత కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పీక్‌లో ఉన్నప్పటికీ విద్యుత్‌ వినియోగం పెరుగుతూనే వచ్చింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని