Amaravati: చిన్నపెళ్లనూ తీసుకెళ్లలేరు

తాజా వార్తలు

Updated : 19/06/2021 15:20 IST

Amaravati: చిన్నపెళ్లనూ తీసుకెళ్లలేరు

550వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం గద్దె దిగేంతవరకూ ఉద్యమం కొనసాగిస్తామని రాజధాని అమరావతి రైతులు, మహిళలు తేల్చి చెప్పారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం శనివారం 550వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు, మహిళలు రాజధాని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగించారు. మందడంలో మహిళలు బుద్ధుడి విగ్రహానికి పూలు సమర్పించి అంజలి ఘటించారు. ఉద్దండరాయునిపాలెంలో రైతులు పోలేరమ్మ ఆలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. వెలగపూడి, తుళ్లూరులో రైతులు శిబిరంలోనే నిరసన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఆకాంక్ష నెరవేరే వరకు ఉద్యమాన్ని విరమించబోమని స్పష్టం చేశారు. రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ మంత్రులు ఇష్టానుసారం మాట్లాడటం తగదని హితవుపలికారు. అమరావతి నుంచి చిన్న మట్టిపెళ్లను కూడా విశాఖకు తీసుకెళ్లలేరని రైతులు వ్యాఖ్యానించారు. మరోవైపు ఉద్యమం నేపథ్యంలో రైతులు, మహిళలు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించేందుకు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి పరిధిలో కొత్తవారికి ఆశ్రయం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ర్యాలీలు, నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని