Amaravati: 5వేల రోజులైనా పోరాడతాం

తాజా వార్తలు

Updated : 30/04/2021 15:18 IST

Amaravati: 5వేల రోజులైనా పోరాడతాం

స్పష్టం చేసిన ఐకాస నేతలు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. మహిళలు, రైతులు రోడ్లపైకి వచ్చి గత కొన్నిరోజులుగా తమ నిరసన తెలియజేస్తున్నారు. రైతుల పోరాటం శుక్రవారం 500 రోజులకు చేరింది. ఈ సందర్భంగా ఐకాస ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వర్చువల్‌గా చేపట్టిన ఈ కార్యక్రమంలో లక్ష మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. రాయపూడి దీక్షా శిబిరంలో దళిత చైతన్య గీతాన్ని ఐకాస నేతలు, దళిత ఐకాస నేతలు విడుదల చేశారు. ఉద్దండరాయునిపాలెం దీక్షా శిబిరంలో బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. బుద్ధుడు చూపిన అహింసా మార్గంలోనే అమరావతి లక్ష్యాన్ని సాధిస్తామని ఐకాస నేత సుధాకర్‌ అన్నారు.

అమరావతి కోసం చేపట్టిన ఈ ఉద్యమాన్ని ఎన్నిరోజులైనా కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాట పంథా వీడేది లేదని మరోసారి తేల్చిచెప్పారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా రాజధాని పరిధిలోని రైతులకు కౌలు డబ్బులు కూడా సక్రమంగా వేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చిన రైతుల గురించి ప్రభుత్వం కనీసం ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. 5వేల రోజులైనా అమరావతి కోసం పోరాడతామని స్పష్టం చేశారు. రైతుల్ని కించపరిచేలా ప్రభుత్వ వైఖరి ఉందని, పోలీసుల ద్వారా తమ పోరాటాన్ని అణచివేస్తున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతులు, మహిళలు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని