AP News: ఎమ్మెల్యే శ్రీదేవికి నిరసన సెగ

తాజా వార్తలు

Updated : 03/07/2021 14:41 IST

AP News: ఎమ్మెల్యే శ్రీదేవికి నిరసన సెగ

అమరావతి: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది. గుంటూరు జిల్లా మందడంలో గ్రామ సచివాలయ భవనం ప్రారంభానికి వెళుతున్న శ్రీదేవిని లింగాయపాలెం సమీపంలో అమరావతి దళిత ఐకాస నేతలు అడ్డుకున్నారు. అసైన్డ్ భూముల రైతులకు ప్రభుత్వం కౌలు డబ్బులు, పింఛన్‌ చెల్లించడం లేదంటూ ఆమెకు వినతిపత్రం అందించడానికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా రోడ్డుపై బైఠాయించిన వారిని పోలీసులు పక్కకు నెట్టివేశారు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తే ఎమ్మెల్యే శ్రీదేవి కనీసం పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని