వరద నీటిలో పెళ్లి ఊరేగింపు

తాజా వార్తలు

Published : 11/07/2021 01:05 IST

వరద నీటిలో పెళ్లి ఊరేగింపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేడు పట్టణాల్లో ఆకాశహార్మ్యాలు నిర్మితం అవుతుంటే.. కొన్ని పల్లెల్లో కనీస అవసరాలు తీర్చే సదుపాయాలు కూడా ఉండటం లేదు. వర్షాలు పడితే  గ్రామాల పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఇప్పటికీ వరదలు వస్తే నీటిలో మునిగే గ్రామాలు దేశంలో కోకొల్లలు. అయితే.. వాతావరణం అనుకూలించకపోయినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ పని తాము చేసుకుపోతారు గ్రామాల్లో నివసించే ప్రజలు. అందుకు నిదర్శనమే బీహార్‌లో జరిగిన ఈ ఘటన. బీహార్లోని ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బాగ్‌మతి నది పోటెత్తగా దాని పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు నీటమునిగాయి. ఈ క్రమంలో సమస్తీపూర్‌ జిల్లా, గోబర్సిత్తా అనే గ్రామంలో పెళ్లి పెట్టుకున్న ఓ కుటుంబం వధువును పడవపై తీసుకొచ్చి వివాహం జరిపించారు. పెళ్లి అనంతరం వధూవరుల ఊరేగింపు కూడా ఆ వరద నీటిలోనే నిర్వహించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని