‘డిజిటల్’‌కి దూరంగా ఉంటే నగదు బహుమతి

తాజా వార్తలు

Published : 27/08/2020 00:36 IST

‘డిజిటల్’‌కి దూరంగా ఉంటే నగదు బహుమతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ టెక్‌ యుగంలో క్షణమయినా డిజిటల్‌ సదుపాయాలకు దూరంగా ఉండగలమా? మొబైల్‌ ఉండీ అందులో ఇంటర్నెట్‌ లేకపోతే ఇప్పటి యువతకు రోజే గడవదు. వీటికి దూరంగా ఉండాలంటే మహా కష్టం. అయితే ఓ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ సంస్థ వీటన్నింటికీ దూరంగా ఉండగలితే నగదు బహుమతి ఇస్తామని ఛాలెంజ్‌ విసిరింది. అయితే ఇది ఇక్కడ కాదు.. అమెరికాలో.

యూఎస్‌లోని ఉతాహ్‌లో సాల్ట్‌ లేక్‌ సిటీ కేంద్రంగా నడిచే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సంస్థ ‘డిజిటల్‌ డీటాక్స్‌ ఛాలెంజ్‌’ను ప్రారంభించింది. ఎవరైతే మొబైల్‌, ఇంటర్నెట్‌ వాడకుండా, డిజిటల్‌ లోకానికి దూరంగా యూఎస్ నేషనల్‌ పార్కులో ఓ వాహనంలో రెండ్రోజుల పాటు ఉంటే వెయ్యి డాలర్లు (సుమారు రూ. 75వేలు) నగదు బహుమతి ఇస్తుందట. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే దరఖాస్తుదారుడు 25 ఏళ్లుపైబడి ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి.. అమెరికా వచ్చేందుకైనా సిద్ధంగా ఉండగలగాలట. ఈ ఛాలెంజ్‌లో పాల్గొని బయటకు వచ్చిన వెంటనే వారికి శాటిలైట్‌ సంస్థ ఇంటర్నెట్‌ సదుపాయం ఇస్తుంది. వాహనంలో ఇంటర్నెట్‌ లేకుండా గడిపిన అనుభవాలను వారు సోషల్‌మీడియా వేదిక పంచుకోవాల్సి ఉంటుంది. అయితే డిజిటల్‌ లోకానికి దూరంగా ఉండగలిగిన విజేతలను మాత్రం సెప్టెంబర్‌ 23న సంస్థ ప్రకటిస్తుందట.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని