దుబాయ్‌లో అతిపెద్ద ఫౌంటెయిన్‌!

తాజా వార్తలు

Published : 06/10/2020 01:42 IST

దుబాయ్‌లో అతిపెద్ద ఫౌంటెయిన్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్‌ దుబాయ్‌లో ఈ నెల 22న ప్రారంభం కానుంది. పామ్‌ జుమేరియా దీవుల్లోని పాయింటే వద్ద పామ్‌ ఫౌంటెయిన్‌ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. సముద్ర జలాల్లో 14వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3వేల ఎల్‌ఈడీ లైట్లు కలిగిన ఫౌంటెయిన్‌ నుంచి 105మీటర్ల ఎత్తుకు నీరు ఎగిసి పడుతుంది. అతిపెద్ద ఫౌంటెయిన్‌గా గిన్నిస్‌ బుక్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పామ్‌ ఫౌంటెయిన్‌లో ఐదు విభిన్న ప్రదర్శనలున్నాయి. ఎవరైనా తమ కోసం ప్రత్యేకంగా అడిగితే మరో 20 ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. సాయంత్రం ఏడు నుంచి రాత్రి 12గంటల మధ్యలో సంగీతంతో ప్రదర్శిస్తారు. ప్రతి 30నిమిషాలకు ఒకసారి 3నిమిషాల పాటు ఈ ప్రదర్శనలు కనువిందు చేస్తాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని