అఫ్గాన్‌ వదిలి వచ్చేయండి.. టికెట్లకు రుణం ఇస్తాం..

తాజా వార్తలు

Published : 08/08/2021 02:04 IST

అఫ్గాన్‌ వదిలి వచ్చేయండి.. టికెట్లకు రుణం ఇస్తాం..

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాలిబాన్ల హింస పెచ్చుమీరుతున్న నేపథ్యంలో వెంటనే అఫ్గానిస్థాన్‌ వదిలి, స్వదేశానికి చేరుకోవాలని తమ పౌరులకు అమెరికా విజ్ఞప్తి చేసింది. కాబూల్‌లోని యూఎస్‌ రాయబార కార్యాలయం శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. విమాన టికెట్లు కొనేందుకు డబ్బులు లేనివారికి రుణాన్ని అందిస్తామని తెలిపింది.  స్థానికంగా భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఇక్కడుంటున్న అమెరికన్లకు కార్యాలయం తరఫున సాయమందించే అవకాశాలు సన్నగిల్లాయని, బెదిరింపులు, హింస కారణంగా.. ఇక్కడ సిబ్బందినీ తగ్గించినట్లు వెల్లడించింది.

ఇప్పటికే కాబూల్ వెలుపల దేశీయ విమాన సర్వీసులు, రోడ్డు రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్నాయి.. త్వరలో ఇవీ రద్దయ్యే ప్రమాదం ఉందని యూఎస్‌ ఎంబసీ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా భద్రతా దళాలు అఫ్గాన్‌ను విడిచి వెళ్తున్న దరిమిలా.. స్థానికంగా దేశ సైన్యానికి, తాలిబాన్లకు మధ్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే.  మరోవైపు ఈ వ్యవహారాలపై వైట్‌హౌస్ ప్రతినిధి జెన్ సాకి మాట్లాడుతూ.. తమ దేశం తాలిబాన్ల దురాగతాలను నిశితంగా పరిశీలిస్తోందన్నారు. అయితే, అమెరికా తన దళాల ఉపసంహరణను పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని