ఈ లాక్‌డౌన్‌.. స్థానికులకు మాత్రమే..

తాజా వార్తలు

Published : 16/12/2020 02:00 IST

ఈ లాక్‌డౌన్‌.. స్థానికులకు మాత్రమే..

ఇస్తాంబుల్‌: రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండు అనేది ఒక సామెత. కానీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో మాత్రం మీరు పర్యటకుడిగానే ఉండాలి. లేదంటే క్వారంటైన్‌కు చేరుస్తారు. వివరాల ప్రకారం..కరోనా సమయంలో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ప్రతిచోట లాక్‌డౌన్‌ను విధించారు. అలాగే టర్కీలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఇస్తాంబుల్‌లో వారాంతాల్లో లాక్‌డౌన్‌ను విధిస్తున్నారు. ఆ నిబంధనల ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. ఈ సమయంలో పౌరులెవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. కానీ ఇది స్థానికులకు మాత్రమే పరిమితం. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యటకుల కోసం ఈ చారిత్రక నగరం తలుపులు తెరిచే ఉంచుతోంది. లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించే పోలీసులు పర్యటకుల గుర్తింపు కార్డులు తనిఖీ చేస్తారు. స్థానికులెవరైనా బయట సంచరిస్తున్నట్లయితే వారిపై చర్యలు తీసుకుంటారు. పర్యటకుల కోసం మ్యూజియంలు, రెస్టారెంట్లు తెరుస్తున్నారు. కరోనా వైరస్‌ నుంచి తమను తాము రక్షించుకుంటూ తమ దేశ పర్యటక రంగాన్ని రక్షించుకోవాలని టర్కీ యోచిస్తోంది. జూన్‌ నుంచి టర్కీ దేశ సరిహద్దులను తెరిచే ఉంచుతోంది. పర్యటకులు ఇక్కడికి రాకముందే వారికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించి, ఎటువంటి లక్షణాలు లేకుంటేనే ప్రయాణానికి అనుమతినిస్తున్నారు. కానీ ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

ఇవీ చదవండి..

విహారయాత్రకు వెళ్తున్నారా.. ఇవి పాటించండి!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని