పర్యాటకరంగానికి కరోనా పంచ్‌

తాజా వార్తలు

Published : 29/12/2020 23:29 IST

పర్యాటకరంగానికి కరోనా పంచ్‌

పర్యాటకానికి పీడకలను మిగిల్చిన మహమ్మారి

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2020లో కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. అన్ని రంగాలను తీవ్రంగా దెబ్బతీసింది. పర్యాటకరంగానికి పీడకలను మిగిల్చింది. వైరస్‌ను కట్టడిచేసేందుకు ప్రపంచ దేశాలు విధించిన కఠిన లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా పర్యాటకరంగం నిర్జీవంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ రద్దీగా ఉండే అతి సుందరమైన ప్రాంతాలు సైతం పర్యాటకులు లేక కళావిహీనంగా మారిపోయాయి. ఏసుక్రీస్తు పుట్టిన నగరంగా చెప్పుకునే బెత్లెహాం క్రిస్మస్‌ వేళ పర్యాటకులు లేక మూగబోయింది.

పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే దేశాల్లో ఈజిప్టు ఒకటి. అక్కడి పురాతనమైన పిరమిడ్లను చూసేందుకు ప్రపంచం నలుమూలలనుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే కరోనా కట్టడిలో భాగంగా అంతర్జాతీయ విమానాలపై విధించిన ఆంక్షల కారణంగా పర్యాటకులు లేక ఆ ప్రాంతమంతా వెలవెలబోయింది. ప్రస్తుతం చాలా దేశాలు ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో ఈజిప్టులో ఇప్పుడిప్పుడే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అనేక పర్యాటక ప్రాంతాలకు నెలవైన జపాన్‌.. కొవిడ్‌ ఉద్ధృతితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఒలింపిక్స్‌ క్రీడలను సైతం వాయిదా వేయాల్సి వచ్చింది.

ఎప్పుడూ పర్యాటకులతో కలకలలాడే ఇజ్రాయిల్‌లోని ఎర్రసముద్రం తీరప్రాంతం సైతం నిర్జీవంగా మారింది. పర్యాటకులు లేక అక్కడి రిసార్టులు ఖాళీ అయ్యాయి. ఇజ్రాయిల్‌లో 80 శాతం మంది పర్యాటక రంగంపైనే ఆధారపడి జీవిస్తుండగా వారంతా ఉపాధి కోల్పోయారు. కిర్గిస్థాన్‌లోనూ అదే పరిస్థితి. ఆ దేశ పర్యాటక రంగం లెక్కల ప్రకారం 2018లో 70 లక్షల మంది, 2019లో 85 లక్షల మంది పర్యాటకులు అక్కడ పర్యటించారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో 8 శాతంగా ఉన్న పర్యాటక రంగం వాటా కరోనాతో పూర్తిగా దెబ్బతింది. ఎప్పుడూ రద్దీగా ఉండే అక్కడి హోటళ్లు నిర్మానుష్యంగా మారాయి.

పర్యాటకులను ఆకర్షించేందుకు తైవాన్‌ విమానయాన సంస్థలు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నాయి. కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పర్యాటకులు విమానంలోనే లగ్జరీగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తోంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సైతం ఇదే బాటలో నడుస్తోంది. పర్యాటక కేంద్రాలుగా చెప్పుకొనే ఐరోపా దేశాలను కరోనా తీవ్రంగా దెబ్బతీసింది. తిరిగి పర్యాటకాన్ని గాడిలో పెట్టేందుకు ఆ దేశాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బీచ్‌లు, పర్యాటక బోట్లలోకి ప్రజలను అనుమతిస్తున్నారు. తద్వారా టూరిజం ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనాతో స్తంభించిపోయిన పర్యాటకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అన్ని పర్యాటక దేశాలు చర్యలు ప్రారంభించాయి. కొత్త ఏడాదిలో టూరిజాన్ని గాడిలో పెట్టాలన్న సంకల్పంతో ఉన్నాయి.

ఇవీ చదవండి...

ఈ చలిలో.. ఇగ్లూలో.. ఆ కిక్కే వేరు!

విహారయాత్రకు వెళ్తున్నారా.. ఇవి పాటించండి!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని