కేసీఆర్, జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

తాజా వార్తలు

Published : 14/11/2020 01:35 IST

కేసీఆర్, జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి లోగిలి కార్తీక దీప కాంతులతో వెలగాలని, అన్నదాతల కళ్లల్లో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అజ్ఞాన అంధకారాలను తొలగించే విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలని కోరుకున్నారు. దుష్టశక్తులపై సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటున్నామని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు సకల శుభాలు, సౌభాగ్యాలు కలగాలని.. ప్రతి ఇంటా కోటి దీపాల ఆనందాల దీపాలు వెలగాలని జగన్‌ ఆకాంక్షించారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని