Love with chimpanzee: చింపాంజితో మహిళ ప్రేమాయణం..

తాజా వార్తలు

Updated : 25/08/2021 10:01 IST

Love with chimpanzee: చింపాంజితో మహిళ ప్రేమాయణం..

బ్రసెల్స్‌: కొందరు జంతుప్రేమికులు కుక్కలు, పిల్లుల నుంచి పులి వంటి క్రూరమృగాలను కూడా పెంచుకుని వార్తల్లో నిలుస్తారు. మరికొందరైతే.. పెంపుడు జంతువులను ఇంట్లో మనిషిగా భావించి.. పుట్టినరోజు వేడుకలను కూడా చేస్తారు. అయితే ఓ మహిళ ఏకంగా చింపాంజితోనే ప్రేమలో పడింది. నాలుగేళ్లు దానిని కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న జూ అధికారులు.. ఆమెపై నిషేధం విధించారు. బెల్జియానికి చెందిన ఆది టిమ్మర్‌మన్స్‌ జంతు ప్రేమికురాలు. తరచూ ఆమె  ‘యాంట్‌వెర్ప్‌ జూ’కు వెళ్తుండేది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ‘చిటా’ అనే చింపాంజితో ప్రేమలో పడింది. ఆ చింపాంజి కూడా టిమ్మర్‌మన్స్‌.. జూ కు రావడం గమనించేది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య బంధం ఏర్పడింది. దీంతో చిటా, టిమ్మర్‌మన్స్‌ ఒకరినొకరు చూసుకుంటూ.. గ్లాస్‌ ఎన్‌ క్లోజర్‌ ఎదురుగా నిలబడి సైగలతో సంభాషించుకునే వారు. గాల్లో ముద్దులు కూడా పెట్టుకునే వారు. ఇలా నాలుగేళ్లు గడిచిపోయాయి. నెమ్మదిగా చింపాంజిలో మార్పులు రావడం గమనించిన జూ సిబ్బంది టిమ్మర్‌మన్స్‌ను నిలదీశారు. దీంతో వారిద్దరి మధ్య ‘అఫైర్‌’ ఉందని టిమ్మర్‌మన్స్‌ చెప్పింది. ఫలితంగా ఆమె మళ్లీ ‘జూ’కు రాకుండా నిషేధం విధించాలని నిర్ణయించారు. ‘జూ’లోని జంతువులపై మనుషులు ఎక్కువ ఆప్యాయతగా, ప్రేమగా మెలిగినా అవి వింతగా ప్రవర్తిస్తాయని.. వారితో తప్ప ఇతర జంతువులతో కలిసి ఉండలేవని చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే చిటాపై పెను ప్రభావం చూపుతుందనే కారణంతోనే టిమ్మర్‌మన్స్‌పై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన టిమ్మర్‌మన్స్‌.. ‘‘నేను ఆ జంతువును ప్రేమిస్తున్నా. అది నన్ను ప్రేమిస్తోంది. అంతకు మించి ఇంకేమీ లేదు. అధికారులు దానికి ఎందుకు అడ్డుపడుతున్నారు. మా మధ్య అఫైర్‌ నడుస్తోంది. అదే చెప్పాను’’ అని తెలిపారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని