తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తాజా వార్తలు

Updated : 31/12/2020 12:11 IST

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్యశ్రీ అనుసంధానం

హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ నిర్వహించిన ప్రగతి సమీక్షలో సీఎస్‌ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు ప్రధానికి సీఎస్‌ వివరించారు. వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ తదితర అంశాలపై ప్రధాని సమీక్షించారు. తెలంగాణలో 98.5 శాతం ఇళ్లకు నల్లాల ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని సీఎస్‌ తెలిపారు.

సీఎం కేసీఆర్‌ నిర్ణయం..ఇతర రాష్ట్రాల వారికి ఉపయోగకరం: గవర్నర్‌
ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్‌ భారత్‌తో అనుసంధానిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ స్వాగతించారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వల్ల ఇతర రాష్ట్రాల వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త పేదలకు అత్యాధునిక వైద్యసదుపాయం అందుతుందని గవర్నర్‌ పేర్కొన్నారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని