టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ఫలితాలు విడుదల

తాజా వార్తలు

Published : 13/10/2020 17:53 IST

టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు (టీఎస్ఆర్‌జేసీ) ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది. గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 35 జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఈ నెల 4న ప్రవేశ పరీక్ష జరిగింది. ఎంపీసీలో 1500, బైపీసీలో 1440, ఎంఈసీలో 60 సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కౌన్సెలింగ్ కోసం ఒక్కో సీటుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున మొత్తంగా 6 వేల మందిని ఎంపిక చేశారు. ఈ నెల 19న ఎంపీసీ, 20వ తేదీన బైపీసీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి ఎస్.వేంకటేశ్వర శర్మ తెలిపారు. కౌన్సెలింగ్ కేంద్రాలు, సమయం తదితర వివరాలను ఎంపికైన విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఫలితాలను tsrjdc.cgg.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని