ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన కోతులు

తాజా వార్తలు

Updated : 19/08/2020 16:32 IST

ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన కోతులు

చెన్నై: ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన కోతులు ఆమె దాచుకున్న బంగారం, నగదును ఎత్తుకెళ్లిన ఘటన తమిళనాడులోని తిరువైయ్యూరులో చోటుచేసుకుంది. భర్త చనిపోయిన సారతంబల్ (70) ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అయితే బయట దుస్తులు ఉతుక్కుంటుండగా ఆమె ఇంట్లోకి చొరబడిన ఓ కోతుల గుంపు ఇంట్లోని అరటిపండ్లు, బియ్యం సంచిని ఎత్తుకెళ్లాయి. ఆ బియ్యం సంచిలోనే తన బంగారు ఆభరణాలు, రూ.25 వేలను దాచుకుంది. వృద్ధురాలు కోతులను వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. ఆ డబ్బు తన వైద్య ఖర్చుల కోసం దాచుకున్నట్లు ఆమె‌ తెలిపింది. స్థానికులు ఆ కోతుల కోసం గాలించినా వాటి జాడ తెలియరాలేదు. ఆగ్రహించిన స్థానికులు ఆ కోతులను బంధించాలని, ఇకపై వాటిని గ్రామంలో కనిపించకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని