Covid test: ముక్కులో విరిగిన స్వాబ్‌ స్టిక్‌
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 20:07 IST

Covid test: ముక్కులో విరిగిన స్వాబ్‌ స్టిక్‌

రామడుగు: కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావుపల్లిలో కరోనా పరీక్ష నిర్వహించే సమయంలో జరిగిన నిర్లక్ష్యం కలకలం రేపింది. మండలానికి చెందిన ఓ గ్రామ సర్పంచి శేఖర్‌ కొవిడ్‌ పరీక్ష చేయించుకునేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లారు. అక్కడ పరీక్ష చేస్తుండగా టెస్టు చేసేందుకు వినియోగించే స్వాబ్‌ స్టిక్‌ ముక్కులో విరిగిపోయింది. తీవ్ర ఇబ్బంది పడిన బాధితుడు.. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో  తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. స్థానికంగా వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పరుగులు తీశారు. అక్కడ ఎండోస్కోపి విధానం ద్వారా స్వాబ్‌ స్టిక్‌ను బయటకు తీయడంతో బాధితుడు ఊపిరి పీల్చుకున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని