మరో 3 రోజుల్లో సౌదీలో టీకా పంపిణీ!

తాజా వార్తలు

Published : 16/12/2020 22:33 IST

మరో 3 రోజుల్లో సౌదీలో టీకా పంపిణీ!

దుబాయ్‌: సౌదీ అరేబియా మరో మూడు రోజుల్లో కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఫైజర్‌ టీకాను ఆమోదించిన వారం రోజుల్లోనే వారీ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో ప్రజలంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మంగళవారం సాయంత్రం ప్రభుత్వం కోరింది. ఈ టీకాను మూడు దశల్లో ప్రజలకు అందించనున్నట్లు తెలిసింది.

మొదటి దశలో 65ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక రోగులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి టీకా ఇవ్వనున్నారు. వైరస్‌కు ఎక్కువ ప్రభావితం అయ్యేవారికి వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత రెండో దశలో 50 ఏళ్లకు పైబడిన వారికి ఇస్తారు.  మూడో దశలో మిగతా అందరికీ టీకా వేయిస్తారు. వ్యాక్సిన్‌ పంపిణీ తేదీలు, తదితర వివరాలు ప్రభుత్వం తెలియజేయలేదు.  బ్రిటన్, కెనెడా, అమెరికా‌ ఇప్పటికే టీకా పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సౌదీలో ఇప్పటి వరకు 3,60,000 కరోనా కేసులు, 6,000 మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో సౌదీ గల్ఫ్‌ దేశాల్లో మొదటి  స్థానంలో ఉంది. కానీ రికవరీలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇవీ చదవండి..

ప్రపంచంలో పావువంతు ప్రజలకు టీకా కష్టమే..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని