మరింత కోలుకున్న విమానయాన రంగం!

తాజా వార్తలు

Published : 07/11/2020 19:49 IST

మరింత కోలుకున్న విమానయాన రంగం!

న్యూదిల్లీ : కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులతో పాటు అంతర్జాతీయ సర్వీసులూ రెండు నెలల పాటు రద్దయ్యాయి. దేశంలో లాక్‌డౌన్‌ విధించడంతో మార్చి నెలాఖరు నుంచి మే నెల 25 వరకూ దేశీయ విమానయాన రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. అన్‌లాక్‌ నిబంధనలతో మే నెల చివరి నుంచి తిరిగి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలుత కరోనా భయంతో విమాన ప్రయాణానికి వెనకడుగు వేసినా రానురానూ ప్రయాణికులు పెరిగారు. ఈ క్రమంలో సెప్టెంబరు నెలతో పోలిస్తే అక్టోబరులో 33 శాతం వృద్ధి నమోదైనట్లు ఇండియన్‌ క్రెడిట్‌ రైజింగ్‌ ఏజెన్సీ(ఇక్రా) అభిప్రాయపడింది. అక్టోబరులో 52 లక్షల మంది విమానయానం చేసినట్టు శుక్రవారం ఈ ఏజెన్సీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ సంఖ్య మే 25 నుంచి అక్టోబరు 31 వరకూ 16 మిలియన్లు ఉన్నట్లు నివేదిక చెబుతోంది. 

దీంతో పాటు దేశంలో తిరిగి విమాన సర్వీసుల ప్రారంభమైన నాడు వాటి సంఖ్య 416 ఉండగా.. అక్టోబరు 26 నాటికి 1749కి పెరిగినట్లు ఇక్రా ఉపాధ్యక్షురాలు కింజల్‌ షా తెలిపారు. వందే భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఇతర దేశాల నుంచి మనదేశానికి వచ్చిన వారు, ఇక్కడి నుంచి వెళ్లిన వారి సంఖ్య దాదాపు 11 లక్షలు ఉన్నట్లు ఇక్రా నివేదిక చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు 87 శాతం తగ్గాయని, ప్రస్తుతం అందులోనూ 22 శాతం పెరుగుదల నమోదైనట్లు నివేదిక అభిప్రాయపడింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని